Prapancha Katha
ENతె
Cyanide Mohan

Karnataka · 2020

Cyanide Mohan

A Karnataka schoolteacher, 20 women, and the stolen phone that ended a five-year killing spree

3 part series

కేసు — భాగం భాగంగా

Part 1

బయటికి చూస్తే ఒక మామూలు ప్రైమరీ స్కూల్ టీచర్. కానీ 20 మంది ఆడవాళ్లను వరుసగా చంపేసిన ఒక సైకో కిల్లర్! ఇది దేశాన్ని వణికించిన 'సైనైడ్ మోహన్' కేస్.

కర్ణాటకకు చెందిన మోహన్ కుమార్... కట్నం ఇచ్చుకోలేని పేద అమ్మాయిలనే టార్గెట్ చేసేవాడు. "కట్నం వద్దు, ఇంట్లో ఉన్న నీ కొద్దిపాటి నగలు తీసుకుని రా, వేరే ఊరు వెళ్లి గుడిలో పెళ్లి చేసుకుందాం" అని నమ్మించేవాడు.

ఆ అమ్మాయిలతో కలిసి వేరే ఊరు వెళ్లి, బస్టాండ్ దగ్గర్లో ఉన్న ఒక లాడ్జిలో దిగేవాడు. మరుసటి రోజు ఉదయం... "గుడికి బస్సు ఎక్కాలి పదా. రద్దీగా ఉంటుంది, నీ నగలు సేఫ్‌గా ఇక్కడే లాడ్జిలో పెట్టేయ్" అని చెప్పి, వాళ్ళని బస్టాండ్‌కి తీసుకొచ్చేవాడు.

బస్టాండ్‌కి వచ్చాక వాడు ఒక టాబ్లెట్ ఇచ్చి... "ఇది ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే మెడిసిన్. కళ్ళు తిరుగుతాయి, పబ్లిక్ వాష్‌రూమ్‌లోకి వెళ్లి వేసుకో" అనేవాడు. వాళ్ళు లోపలికి వెళ్లి ఆ సైనైడ్ మింగగానే సెకన్లలో చనిపోయేవారు. వాడు మాత్రం సైలెంట్‌గా లాడ్జికి వెళ్లి, నగలు తీసుకుని ఎస్కేప్!

ఒక పబ్లిక్ బస్టాండ్ లో బాడీ దొరకడంతో... పోలీసులకు ఆ లాడ్జికి ఎలాంటి లింక్ దొరికేది కాదు. ఇవన్నీ సూసైడ్స్ అనుకుని పోలీసులు కేసులు క్లోజ్ చేసేవారు!

ఈ మాస్టర్ ప్లాన్ తో ఐదేళ్ల పాటు వాడిని ఎవరూ పట్టుకోలేకపోయారు. కానీ వాడు చేసిన ఒకే ఒక్క చిన్న తప్పు... ఒక చనిపోయిన అమ్మాయి ఫోన్ నుంచి వచ్చిన ఒక కాల్ వాడి సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టింది.

అసలు ఆ కాల్ ఎవరికి వెళ్ళింది? ఈ సైకో కిల్లర్ పోలీసులకు ఎలా దొరికాడు?

Part 2

20 హత్యలు... ఐదేళ్ల పాటు ఏ ఒక్క ఆధారం లేకుండా పోలీసులకు చుక్కలు చూపించిన సైకో కిల్లర్, తను చేసిన 20వ హత్యలో దొరికిపోయాడు. వాడి అత్యాశే వాడి పాలిట శాపంగా మారింది.

జూన్ 2009లో 'అనిత' అనే అమ్మాయిని మోహన్ అవే మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. సేమ్ ప్లాన్... లాడ్జిలో నగలు పెట్టించి, హాసన్ బస్టాండ్ వాష్‌రూమ్‌లో సైనైడ్ ఇచ్చి చంపేశాడు. కానీ ఈసారి వాడు ఒక ప్రాణాంతకమైన తప్పు చేశాడు.

అనిత నగలతో పాటు... ఆమె కొత్త మొబైల్ ఫోన్ ని కూడా మోహన్ దొంగిలించాడు. దాన్ని పారేయకుండా, తన మేనల్లుడికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. అనిత మిస్సింగ్ కేసు ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు... ఆ ఫోన్ IMEI నెంబర్ ని ట్రాక్ చేశారు.

సిగ్నల్ ఆధారంగా పోలీసులు మేనల్లుడిని పట్టుకుని ఇంటరాగేట్ చేస్తే... "మా మావయ్య మోహన్ ఇచ్చాడు" అని చెప్పాడు. పోలీసులు ఆ మామూలు టీచర్‌ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయగా కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి.

అసలు ఒక టీచర్ కి ప్రాణాలు తీసే సైనైడ్ ఎలా వచ్చింది? "నేను కంసాలిని, నగలు పాలిష్ చేయడానికి సైనైడ్ కావాలి" అని మంగళూరులోని కెమికల్ షాప్స్ లో అబద్ధం చెప్పి సైనైడ్ కొన్నాడు!

20 మందిని చంపినట్టు పోలీసుల ముందు ఈ సైకో కిల్లర్ నేరం ఒప్పుకున్నాడు. కానీ కోర్టులో వాడికి శిక్ష పడకుండా ఉండేందుకు ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది.

పబ్లిక్ టాయిలెట్స్ లో చనిపోవడం వల్ల, వాడికి వ్యతిరేకంగా ఒక్క సాక్షి కూడా లేడు! మరి కంటితో చూసిన సాక్షులే లేని ఈ కేసులో... పోలీసులకు వాడిని ఉరి కంబం ఎక్కించడానికి దొరికిన ఆ లాస్ట్ ప్రూఫ్ ఏంటి?

Part 3

20 మందిని చంపిన ఒక రాక్షసుడు... ఎవరూ చూడలేదని, సాక్ష్యాలు లేవని దర్జాగా తప్పించుకుంటాడా? ఇక్కడే పోలీసులు తమ మాస్టర్ మైండ్ వాడారు!

కోర్టులో అడుగుపెట్టగానే మోహన్ అడ్డం తిరిగాడు. "నేనెవర్నీ చంపలేదు, పోలీసులు నన్ను కొట్టి బలవంతంగా నేరం ఒప్పుకునేలా చేశారు" అని చెప్పాడు. బస్టాండ్ వాష్‌రూమ్‌లో జరిగిన హత్యలు కాబట్టి కంటితో చూసిన సాక్షులు లేరని వాడి ధీమా.

కానీ పోలీసులు ఫోకస్ చేసింది మర్డర్ స్పాట్ మీద కాదు... వాడు అమ్మాయిలతో బస చేసిన లాడ్జిల మీద! వాడు లాడ్జి రికార్డ్స్‌లో 'సుధాకర్' లాంటి ఫేక్ పేర్లతో సంతకాలు చేశాడు. పోలీసులు ఆ రిజిస్టర్స్ ని హ్యాండ్‌రైటింగ్ ఎక్స్‌పర్ట్స్ కి పంపించారు.

ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో ఆ సంతకాలన్నీ మోహన్‌వే అని ప్రూవ్ అయింది! అంతేకాదు, వాడి ఇంట్లో దాచిన సైనైడ్ ప్యాకెట్స్ దొరికాయి. చనిపోయిన 20 మంది అమ్మాయిల నగలను... వాడు మంగళూరులోని ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టిన ఫుల్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ దొరికాయి.

సాక్షులు లేకపోయినా, ఈ ఆధారాలతో చైన్ లింక్ లాగా కోర్టు ముందు కేసును నిలబెట్టారు పోలీసులు. చివరగా 2020లో తన 20వ కేసులో కూడా వాడికి శిక్ష ఖరారైంది.

పలు కేసుల్లో ఉరిశిక్ష, జీవిత ఖైదులు పడ్డ ఈ 'సైనైడ్ మోహన్'... ఇక తన జీవితాంతం జైలు నాలుగు గోడల మధ్యే మగ్గిపోతాడు.

  • #cyanide
  • #karnataka