
Koodathayi, Kerala · 2019
కూడత్తాయి సైనైడ్ హత్యలు
Six deaths in one Kerala family over fourteen years, and the brother who refused to believe it
4 part series
కేసు — భాగం భాగంగా
Part 1
ఇది కేరళలోని కూతాడాయి అనే ఒక ప్రశాంతమైన ఊరు. అక్కడ 'పొన్నమట్టం' కుటుంబానికి చాలా పేరు, ప్రతిష్టలు ఉన్నాయి.
టామ్ థామస్, అన్నమ్మ... వీళ్ల కొడుకు రాయ్ థామస్. 1997లో రాయ్‌కి జాలీ జోసెఫ్ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది.
ఇంట్లోకి కొత్త కోడలిగా అడుగుపెట్టిన జాలీ... చాలా త్వరగానే అందరితో కలిసిపోయింది.
చూడటానికి చాలా పద్ధతిగా, దైవభక్తి ఉన్న అమ్మాయిలా కనిపించేది. తనకు M.Com డిగ్రీ ఉందని... NIT కాలికట్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో visiting professorగా పనిచేస్తున్నానని అందరికీ చెప్పేది.
ప్రతిరోజూ ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మెడలో ID card వేసుకుని, కారులో హుందాగా వెళ్లేది.
ఊర్లో వాళ్లే కాదు... బంధువులు, చివరికి తన భర్త రాయ్ కూడా ఆమెను చూసి ఎంతో గర్వపడేవాడు.
కానీ ఆ ఇంట్లో ఆర్థిక వ్యవహారాలన్నింటినీ మాత్రం అత్తయ్య అన్నమ్మే చూసుకునేది. అది జాలీకి నచ్చలేదు.
ఇంట్లో తన మాటే చెల్లాలి... తనకే పూర్తి ఆధిపత్యం ఉండాలని జాలీ కోరుకుంది.
అంతా సరిగ్గా జరుగుతున్నట్టే కనిపిస్తున్న సమయంలో... 2002లో ఆ ఇంట్లో మొదటి మరణం జరిగింది.
అత్తయ్య అన్నమ్మకు... జాలీ ఎంతో ప్రేమగా తయారుచేసి ఇచ్చిన మటన్ సూప్ తాగిన కొద్దిసేపటికే ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయింది.
అందరూ దాన్ని గుండెపోటుగానే భావించారు. పోలీసులకు కూడా ఎలాంటి అనుమానం రాలేదు. కేసు కూడా అక్కడితో ముగిసిపోయింది.
కానీ... అసలు కథ అప్పుడే మొదలైంది.
ఆ మటన్ సూప్‌లో జాలీ ఏం కలిపింది? ఆ తర్వాత ఆమె ఎవరిని చంపింది?
Part 2
అత్తయ్య అన్నమ్మ mutton soup తాగి చనిపోయిన తర్వాత... ఇంట్లో అధికారం మొత్తం జాలీ చేతుల్లోకి వచ్చేసింది.
కానీ... జాలీ ఆశలకు అంతులేదు. Next target... మామయ్య, టామ్ థామస్.
ఆరు సంవత్సరాలు గడిచాయి.
2008లో ఒకరోజు... టామ్ థామస్‌కి జాలీ ఒక capsule ఇచ్చింది. ఆ capsule వేసుకున్న కొద్ది నిమిషాలకే... ఆయన నోటి వెంట నురగ వచ్చి చనిపోయాడు.
అందరూ దీన్ని కూడా వయసు మీద పడిన వాళ్లకు వచ్చే సహజ మరణంగానే భావించారు.
కానీ అంతటితో ఆగలేదు. వెంటనే జాలీ ఒక fake 'Will' తయారుచేసి... ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుంది.
అయినా... ఎవరికీ జాలీ మీద ఎలాంటి అనుమానం రాలేదు!
Cut చేస్తే... 2011. భర్త రాయ్ థామస్‌కి, జాలీకి మధ్య గొడవలు మొదలయ్యాయి. రాయ్‌కి తాగుడు అలవాటు ఉండేది.
ఒకరోజు రాత్రి... రాయ్‌కి ఇష్టమైన rice, 'kadala curry' అంటే chickpea curry వండి పెట్టింది జాలీ.
అది తిన్న కొద్దిసేపటికే... రాయ్ కూడా bathroomలో కుప్పకూలిపోయి చనిపోయాడు.
ఈసారి కూడా జాలీ ఏడుస్తూ... రాయ్ suicide చేసుకున్నాడని అందరినీ నమ్మించింది.
కానీ... ఒక చిన్న విషయం ఆమె ఊహించలేదు. రాయ్ మామయ్య మ్యాథ్యూకి ఒక చిన్న అనుమానం వచ్చింది.
మ్యాథ్యూ పట్టుబట్టి... రాయ్ bodyకి post-mortem చేయించాడు.
ఆ reportలో ఏం వచ్చిందో తెలుసా? CYANIDE.
రాయ్ కడుపులో భయంకరమైన cyanide poison ఉన్నట్టు post-mortemలో తేలింది!
అసలు suicide చేసుకునే వ్యక్తికి cyanide ఎక్కడి నుంచి వచ్చింది?
మరి... జాలీ ఈ post-mortem నుంచి ఎలా తప్పించుకుంది? ఈ నిజాన్ని బయటపెట్టిన మామయ్య మ్యాథ్యూ పరిస్థితి ఏమైంది?
Part 3
Roy కడుపులో cyanide దొరికింది. మరి జాలీ ఎలా తప్పించుకుంది?
Policeలకి, చుట్టుపక్కల వాళ్లకి... "Roy అప్పుల బాధతో తట్టుకోలేక... cyanide తాగి suicide చేసుకున్నాడు" అని ఒక fake story అల్లింది.
అందరూ నమ్మేశారు. కానీ... ఒక్కరు మాత్రం నమ్మలేదు. ఆయనే Roy మామయ్య... Mathew.
Roy చనిపోయిన తీరు మీద Mathewకి మొదటి నుంచే అనుమానం ఉంది. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని జాలీ భయపడింది.
2014లో... Mathew ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని, జాలీ ప్రేమగా coffee కలిపి ఇచ్చిందని పోలీసుల ఆరోపణ.
ఆ coffee తాగిన కొద్దిసేపటికే... Mathew కుప్పకూలిపోయాడు. జాలీనే చుట్టుపక్కల వాళ్లకి విషయం చెప్పింది.
Hospitalకి తీసుకెళ్లేలోపే... Mathew చనిపోయాడు.
The only man asking questions... was dead.
ఇప్పుడు జాలీ కన్ను పడింది... Shaju మీద. Shaju... Royకి cousin brother. మంచి government job. Societyలో మంచి పేరు, గౌరవం.
జాలీ అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ... ఒక సమస్య ఉంది.
Shajuకి అప్పటికే Silyతో పెళ్లైంది. వాళ్లకి... రెండేళ్ల చిన్న పాప Alphine కూడా ఉంది.
జాలీకి ముందు... ఆ పాపే అడ్డుగా కనిపించింది.
2014లో ఒక family functionలో... ఎవరికీ అనుమానం రాకుండా... రెండేళ్ల చిన్నారి తినే breadలో cyanide కలిపిందని పోలీసులు ఆరోపించారు.
అది తిన్న కొద్దిసేపటికే... చిన్నారి అనారోగ్యానికి గురైంది. Hospitalకి తీసుకెళ్లినా... చివరికి ప్రాణాలు కోల్పోయింది.
అందరూ... అది ఒక దురదృష్టకరమైన మరణం అనుకున్నారు.
కానీ... జాలీకి మాత్రం ఇది Shajuని తన దారిలోకి తెచ్చే మరో అడుగు.
ఇప్పుడు Shajuకి కూతురు లేదు. కానీ... భార్య Sily ఇంకా ఉంది.
మరి Silyని జాలీ ఎలా అంతం చేసింది? అసలు 14 ఏళ్ల పాటు జరిగిన ఈ వరుస మరణాల వెనుక నిజం పోలీసులకి ఎలా తెలిసింది?
Part 4
Alphine తర్వాత... Jolly చూపులు Sily మీద పడ్డాయి. Sily... Shaju భార్య. Jollyకి Shaju కావాలంటే... Sily అడ్డుగా ఉంది.
2016లో ఒకరోజు... dentist clinicలో Sily, Jolly పక్కపక్కనే కూర్చున్నారు. Silyకి tablets వేసుకునే time వచ్చిందని Jollyకి తెలుసు.
Shaju లోపలికి వెళ్లగానే... Jolly చాలా coolగా, tabletsకి బదులుగా Silyకి ఒక toxic capsule ఇచ్చిందని పోలీసులు ఆరోపించారు.
ఆ capsule వేసుకున్న కొద్దిసేపటికే... Sily Jolly మీదే కుప్పకూలిపోయింది.
Jolly అక్కడే గట్టిగా ఏడుస్తూ... Shajuని పిలిచి, ambulanceలో hospitalకి తీసుకెళ్లి... ఏమీ తెలియనట్టుగా నటించింది.
కానీ... Sily మాత్రం ప్రాణాలు కోల్పోయింది. తర్వాతి ఏడాదే... Jolly, Shajuని పెళ్లి చేసుకుంది.
14 years... 6 deaths... Zero suspicion.
అంతా smoothగానే జరుగుతోందనుకున్న సమయంలో... USలో ఉన్న Roy తమ్ముడు Rojo Thomasకి ఒక పెద్ద doubt వచ్చింది.
"ఒకే కుటుంబంలో ఇన్ని deaths... ప్రతిసారీ ఆస్తి Jolly పేరు మీదకే ఎందుకు మారుతోంది?"
Rojo Indiaకి వచ్చి... police complaint ఇచ్చాడు. అక్కడి నుంచే... ఈ case మొత్తం మలుపు తిరిగింది.
2019లో Kerala Police... Koodathayi church cemeteryలో పాతిపెట్టిన ఆరుగురి సమాధులను తెరిచి investigation మొదలుపెట్టారు.
Roy bodyలో cyanide ఉన్న విషయం అప్పటికే తెలుసు. తర్వాత Sily remainsలో కూడా cyanide గుర్తించారు.
కానీ... ఈ ఆరు deathsపై police investigation మాత్రం మరింత లోతుగా వెళ్లింది.
ఒక్కొక్క evidence బయటపడే కొద్దీ... ఏళ్ల తరబడి perfect daughter-in-lawలా నటించిన Jolly మీద police అనుమానం బలపడింది.
చివరికి... 2019 October 5. Kerala Police... Jolly Josephని arrest చేశారు.
14 ఏళ్లుగా అందరినీ నమ్మించిన ఆ fake life... ఆ ఒక్క రోజుతో ముగిసిపోయింది.
ప్రతిరోజూ నవ్వుతూ మన మధ్యే తిరిగే ఒక మనిషి వెనుక... ఎంత భయంకరమైన నిజం దాగి ఉండొచ్చో ఈ case చూపించింది.
ఇది Koodathayi serial murder case.
